lirik.web.id
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

lirik lagu tharangini

Loading...

తరంగిణీ ఓ ఓ ఓ తరంగిణీ… ఏ ఒడిలో నీ జననం ఏ కడలికో నీ పయనం
తరంగిణీ ఓ ఓ ఓ తరంగిణీ
తరంగిణీ ఓ ఓ ఓ తరంగిణీ

ఏ ఒడిలో నీ జననం ఏ కడలికో నీ పయనం
ఏ ఒడిలో నీ జననం ఏ కడలికో నీ పయనం
తరంగిణీ ఓ ఓ ఓ తరంగిణీ
ఇసుక తిన్నెలెదురైనా ఏ గిరులు తిరిగిపొమన్నా
లోయల్లో దిగిపోయినా పాయలుగా విడిపోయినా
లోయల్లో దిగిపోయినా పాయలుగా విడిపోయినా
ఆగిపోదు నీ నడకా
ఆగిపోదు నీ నడకా ఆ గమ్యం చేరేదాకా
తరంగిణీ ఓ ఓ ఓ తరంగిణీ
గుండె ముక్కలయిపోయి సుడిగుండాలే చెలరేగి
కల్లోలం విషమించినా
కల్లోలం విషమించినా కాలమే వంచించినా
తరంగిణీ ఓ ఓ ఓ తరంగిణీ
ఆగిపోదు నీ నడకా ఆ గమ్యం చేరేదాకా
తరంగిణీ ఓ ఓ ఓ తరంగిణీ
ఎదలోని రాపిడిలోన కదలాడు నురగలపైనా
కలకల నవ్వులున్నాయో
కలకల నవ్వులున్నాయో కన్నీళ్ళు పొంగుతున్నాయో
తెలిసేదెవరికీ ఆ దైవానికి
తరంగిణీ ఓ ఓ ఓ తరంగిణీ
ఏ ఒడిలో నీ జననం ఏ కడలికో నీ పయనం
ఏ ఒడిలో నీ జననం ఏ కడలికో నీ పయనం
తరంగిణీ ఓ ఓ ఓ తరంగిణీ
తరంగిణి ఓ తరంగిణి ఓ తరంగిణి ఓ తరంగిణి

రచన: సి.నారాయణ రెడ్డి
గానం: బాలు


Lirik lagu lainnya:

LIRIK YANG LAGI HITS MINGGU INI

Loading...