lirik.web.id
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

lirik lagu k.j. yesudas & chitra - jumma jumma

Loading...

చిత్రం: బ్రహ్మ (1992)
సంగీతం: బప్పిలహరి
నేపధ్య గానం: ఏసుదాసు, చిత్ర

ఝుమ్మా ఝుమ్మా కొమ్మరెమ్మలో… తుమ్మెదాడేనోయమ్మలో
గుచ్చి గుచ్చి కన్నెగుండెల్లో… గుమ్మెత్తించెనోయమ్మలో

జుంటితేనెకై చంటి పువ్వుతో సరసమాడుతుంటే
హోయ్. సోకులాడి ఆ రేకు విప్పుకుని తుళ్ళేపడుతుంటే

చిలిపి కోరికే వలపు కిన్నెరై కులుకులాడుతుంటే. హోయ్
కలికి గుండెలో వొణుకు సూదులే తుళ్ళీ ఆడే

రాగాలమ్మ పాట. మేఘాలమ్మతోటి రాయబారమే పంపగా
జాగారాల రేయి. ఊగాడే వయ్యారం. జతగాడే శృతి చేయగా

సందెరంగుల సన్న గాజులే చిందులాడుకోగా
కందిపోయినా కన్నెబుగ్గలే సింగారాలే ఆడా

ఝుమ్మా ఝుమ్మా కొమ్మరెమ్మలో… తుమ్మెదాడేనోయమ్మలో
గుచ్చి గుచ్చి కన్నెగుండెల్లో… గుమ్మెత్తించెనోయమ్మలో

నింగి నీలవేణి కొంగుచాటులోని… రంగు బొంగరాలాడగా
ఆ దాగుడుమూతల్లోనా దాచిన అందాలన్నీ. రాగలవాడికే అందించగా

ఆ దొంతుమల్లెల బంతులాటతో రేయి గడచిపోగా
గంతులాడు కౌగిళ్ళ వేడిలో ఒళ్ళే తుళ్ళీ పాడా

ఝుమ్మా ఝుమ్మా కొమ్మరెమ్మలో… తుమ్మెదాడేనోయమ్మలో
గుచ్చి గుచ్చి కన్నెగుండెల్లో… గుమ్మెత్తించెనోయమ్మలో

చిలిపి కోరికే వలపు కిన్నెరై కులుకులాడుతుంటే. హోయ్
కలికి గుండెలో వొణుకు సూదులే తుళ్ళీ ఆడే

ఝుమ్మా ఝుమ్మా కొమ్మరెమ్మలో… తుమ్మెదాడేనోయమ్మలో
గుచ్చి గుచ్చి కన్నెగుండెల్లో… గుమ్మెత్తించెనోయమ్మలో

జుంటితేనెకై చంటి పువ్వుతో సరసమాడుతుంటే
హోయ్. సోకులాడి ఆ రేకు విప్పుకుని తుళ్ళేపడుతుంటే

Lirik lagu lainnya:

LIRIK YANG LAGI HITS MINGGU INI

Loading...