lirik.web.id
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

lirik lagu divya kumar - black and white

Loading...

hey
సిందర వందర లోకం
సందు గొందులొ సీకటి నరకం

yehe పుట్టుకతో పేదరికం
తోడ బుట్టిన తొక్కలో జాతకం
ముక్కిపోయిన subsidy బియ్యం
నీళ్ళ బోరింగు కాడ కయ్యం
పొద్దు పొడిసిందంటే భయ్యం
గుర్తుకొస్తది ఆకలి దయ్యం
ఇంతకన్నా దారుణమేముంటదన్న మాటే ధైర్యం
రరర రరర ర
మా black and white-u బస్తీ సూడన్న
ఏడ ఏసిన blanketఆడే ఉందన్న
he.he.he.hey
మా black and white-u బస్తీ సూడన్నా
ఏడ ఏసిన blanketఆడే ఉందన్నా
hey సిందర వందర లోకం
సందు గొందులొ సీకటి నరకం
yehe పుట్టుకతో పేదరికం
తోడ బుట్టిన తొక్కలో జాతకం
ఎల్లిపాయ కారం
నీళ్ల మజ్జిగన్నం
ఇదె మాకు బిర్యానితో సమానమని పూట గడుపుతం
మురికి సంతలోనే ముక్కు మూసుకుంటాం
గట్టిగా గాలొస్తె పాడే రేకుల కిందే కధను నడుపుతాం
లేనితనమె వారసత్వం ఉన్నదదే పంచిపెడతాం
మా పిల్లల పిల్లల పిల్లతరాలకు పేదోళ్ళమై పడతాం
రరర రరర ర
మా black and white-u బస్తీ సూడన్న
ఏడ ఏసిన blanketఆడే ఉందన్న
నెత్తిమీన రాకెట్లెన్నో పోతన్నా
మా పాకెట్లోనా పైసా nilఅన్నా
హే హే హే హే
తడికెల తానం అతుకుల మానం
ఆడ మగ ఎవ్వరికైన తప్పదు ఇది ఏమి సెయ్యగలం
పిడికెడు ప్యానం బండెడు భారం
తట్ట మొయ్యకుంటె పొట్ట గడవని పాపి జీవులం
కష్టాల దెబ్బలు తింటాం
కన్నీళ్లు మింగుతుంటాం
ఇట్ట పుట్టించినోడిని తిట్టిన తిట్టు తిట్టకుండ తిడతాం
రరర రరర ర
మా black and white-u బస్తీ సూడన్న
ఏడ ఏసిన blanketఆడే ఉందన్న
ye నేల టిక్కెట్టు జిందగి మాదన్నా
ఇది బాల్కని చేరే ఛాన్సె లేదన్నా


Lirik lagu lainnya:

LIRIK YANG LAGI HITS MINGGU INI

Loading...